News September 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 24, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.23 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News September 24, 2025
హెయిర్ గ్రోత్‌కి గుడ్డు పెంకులతో మాస్క్

కోడిగుడ్డు పెంకులతో హెయిర్ మాస్క్ వేస్తే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పెంకులను పొడి చేసి కొబ్బరినూనెలో కలిపి మాడుకు పట్టించాలి. అరగంట ఉంచి కడిగేయాలి. వారానికోసారి ఇలా చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆలివ్‌నూనెలో పెంకుల పొడి కలిపి తలకు పట్టించాలి. తర్వాత తలస్నానం చెయ్యాలి. గుడ్డు పెంకులోని పోషకాలు మాడు pH స్థాయులను బ్యాలెన్స్ చేసి చుండ్రు, దురదను తగ్గిస్తాయి.
News September 24, 2025
వైజాగ్‌కు మరో ప్రముఖ ఐటీ కంపెనీ?

AP: వైజాగ్‌కు మరో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్ రానుంది. నగరంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆ సంస్థ చూస్తున్నట్లు రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఎకరాకు 99పైసల చొప్పున పది ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే 12వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపింది. ఇప్పటికే <<17551159>>TCS<<>>, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో మరిన్ని టెక్ అనుబంధ సంస్థలు వచ్చే అవకాశముంది.
News September 24, 2025
డిగ్రీ అర్హత.. 3,500 ఉద్యోగాలు

కెనరా బ్యాంకు బ్రాంచుల్లో 3,500 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. APలో 242, TGలో 132 ఉద్యోగాలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై, 20-28 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. అభ్యర్థులు ముందుగా https://www.nats.education.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు <