News September 24, 2025
హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువులను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు కబ్జాలకు గురి కావడంతో వరద నేరుగా చెరువుకు వెళ్లకుండా కాలనీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
Similar News
News September 24, 2025
అలర్ట్.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు

TG: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. రేపు ఉ.8.30లోపు వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News September 24, 2025
ఆసియా కప్: గెలిస్తే ఫైనల్‌కే

ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే సూర్య సేన ఫైనల్ చేరనుంది. ఒకవేళ ఓడితే శ్రీలంకతో మ్యాచులో మెరుగైన RRతో గెలవాలి. బంగ్లాతో ఇప్పటివరకు 17 T20Iలు ఆడగా 16 మ్యాచుల్లో IND విజయం సాధించింది. అటు శ్రీలంకపై విజయంతో బంగ్లా జోరు మీద ఉంది. దుబాయ్ వేదికగా రా.8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
News September 24, 2025
టన్ను ఇసుక రూ. 1,100 కే విక్రయం: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గోదావరి ఇసుకను టన్నుకు రూ. 1,100 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూసుమంచి, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, ఖమ్మంలో ఈ ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఐదు బజార్లలో మొత్తం 5,194 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు.