News September 24, 2025

ఇందిరమ్మ లబ్ధిదారులకు నిర్మల్ కలెక్టర్ సూచనలు

image

నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే లబ్ధిదారులు వెంటనే తమ సమీప ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగం రేడీగా ఉందన్నారు. తప్పుడు సమాచారం, వదంతులను నమ్మవద్దని, నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తే చెల్లింపులు వెంటనే ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు.

Similar News

News September 24, 2025

BHPL: బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీనివాస్ రెడ్డికి బంగారు పతకం

image

సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటికే-6వ గని కోల్ కట్టర్ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి బంగారు పతకం సాధించాడు. గతంలో మిస్టర్ సింగరేణి, మిస్టర్ తెలంగాణ టైటిల్, కోల్ ఇండియా వంటి వాటిలో శ్రీనివాస్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. భూపాలపల్లి సింగరేణి ఏరియాకు బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల తోటి కార్మికులు అతడిని అభినందించారు.

News September 24, 2025

ఇళ్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్

image

పేదల ఇళ్ల గృహ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా నిర్మించాలని కలెక్టర్ వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస యోజన పధకం-1.O కింద పేదల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టరేట్ నుంచి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లాకు కేటాయించిన 12 వేల 345 ఇళ్ల నిర్మాణ లక్ష్యానికి గాను, 10 వేల 240 ఇళ్లు పూర్తి చేయగా మిగిలిన 2105 వెంటనే పూర్తి చేయాలన్నారు.

News September 24, 2025

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్ వెట్రిసెల్వి

image

జిల్లాలో జాతీయ రహదారులకు సంబందించిన భూసేకరణ వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కోర్ట్‌లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.