News September 24, 2025

108, 102 సేవలను వినియోగించుకోవాలి: DMHO

image

ప్రజలు అత్యవసర వైద్య సేవల నిమిత్తం 108, 102 వాహనాలను వినియోగించుకోవాలని DMHO అప్పయ్య సూచించారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. జిల్లాలో 17 (108), 7(102) వాహనాలు
ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలతో పాటు గర్భిణులు, కార్డియాక్, పాయిజన్ , స్ట్రోక్ ,శ్వాస సమస్యలు, తీవ్రమైన జ్వరం, ఫిట్స్ అపస్మారక స్థితిలో 108 సేవలను వినియోగించుకోవచ్చన్నారు.

Similar News

News September 24, 2025

దసరా ఆఫర్.. డిస్కౌంట్లు ప్రకటిస్తున్న కంపెనీలు

image

దసరా నవరాత్రుల సందర్భంగా ఓలా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. ముహురత్ మహోత్సవ్ కింద S1 X 2kWh, Roadster X 2.5kW స్కూటర్లను రూ.49,999కే విక్రయిస్తున్నట్లు తెలిపింది. S1 Pro+ 5.2kWh, Roadster X+ 9.1kWh స్కూటర్ల రేట్లను రూ.99,999గా నిర్ణయించింది. అక్టోబర్ 1 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అటు జీఎస్టీ తగ్గింపు, దసరా ఆఫర్లతో బైకులు, కార్లు పెద్దఎత్తున అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News September 24, 2025

చందమామ కథలను ప్రారంభించింది మన తెనాలి వారే

image

తెలుగు రచయిత, ‘చందమామ’ పుస్తక సంపాదకుడు, చందమామ-విజయా కంబైన్స్ సహా నిర్మాత ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) తెనాలిలో జన్మించారు. ఆయన రచయితగా, అనువాదకుడిగా పేరు పొందడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాలే కాక ఆయన నాగిరెడ్డితో కలసి 1947 జులైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఒక్కసారైనా చదివే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.

News September 24, 2025

సినిమా పైరసీలో నెల్లూరు జిల్లా యువకుడి ప్రమేయం..?

image

సినిమా పైరసీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. సీతారాంపురం మండలానికి చెందిన ఓ యువకుడు సినమా పైరసీ చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీతారాంపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి సదరు యువకుడికి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. సీతారాంపురం యువకుడితో పాటు మరికొందరు పాత్ర పైరసీ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది.