News September 24, 2025
జనగామ: 76 వేల మందికి రూ.500లకే వంట గ్యాస్..!

నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఇప్పటివరకు 76,430 మంది వినియోగదారులకు 500లకే వంట గ్యాస్ సరఫరా చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News September 24, 2025
GNT: శకుని పాత్రకు ప్రాణం పోసిన మన ధూళిపాళ

తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లిలో 1922 సెప్టెంబర్ 24న జన్మిచారు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి. ఆయన పేరు చెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది.
News September 24, 2025
గాయత్రీ మాతగా వరంగల్ భద్రకాళీ దేవి

వరంగల్‌లోని భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి గాయత్రీ మాతగా కనిపించనున్నారు. ఈ రోజున చంద్రఘంటా రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం వేళల్లో సింహ, గజ వాహనాలపై ఊరేగింపు ఉంటుంది. నుదుటన చంద్రుడిని ధరించడంతో అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ఈరూపంలో అమ్మను దర్శించుకుంటే శత్రునాశనం ఉంటుందని నమ్మకం.
News September 24, 2025
నేలకొండపల్లి యాక్సిడెంట్ UPDATE

నేలకొండపల్లిలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<17808359>>ఇద్దరు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కొరట్లగూడేనికి చెందిన మనోజ్(18), సన్నీప్రసాద్(17) బంధువులు. రాత్రి నేలకొండపల్లి నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం.