News September 24, 2025
కాగితంపై పులిలా రష్యా.. ట్రంప్ కవ్వింపు

ఉక్రెయిన్‌తో మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా కాగితంపై పులిలా వ్యవహరిస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. EU సహకారంతో రష్యా నుంచి భూభాగాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చర్యలు తీసుకునేందుకు ఉక్రెయిన్‌కు ఇదే సరైన సమయమన్నారు. నాటో దేశాలకు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
Similar News
News September 24, 2025
దసరా ఆఫర్.. డిస్కౌంట్లు ప్రకటిస్తున్న కంపెనీలు

దసరా నవరాత్రుల సందర్భంగా ఓలా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. ముహురత్ మహోత్సవ్ కింద S1 X 2kWh, Roadster X 2.5kW స్కూటర్లను రూ.49,999కే విక్రయిస్తున్నట్లు తెలిపింది. S1 Pro+ 5.2kWh, Roadster X+ 9.1kWh స్కూటర్ల రేట్లను రూ.99,999గా నిర్ణయించింది. అక్టోబర్ 1 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అటు జీఎస్టీ తగ్గింపు, దసరా ఆఫర్లతో బైకులు, కార్లు పెద్దఎత్తున అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
News September 24, 2025
గాయత్రీ మాతగా వరంగల్ భద్రకాళీ దేవి

వరంగల్‌లోని భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి గాయత్రీ మాతగా కనిపించనున్నారు. ఈ రోజున చంద్రఘంటా రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం వేళల్లో సింహ, గజ వాహనాలపై ఊరేగింపు ఉంటుంది. నుదుటన చంద్రుడిని ధరించడంతో అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ఈరూపంలో అమ్మను దర్శించుకుంటే శత్రునాశనం ఉంటుందని నమ్మకం.
News September 24, 2025
ఎస్సీ, ఎస్టీ కేసులపై హైకోర్టు కీలక తీర్పు

AP: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన FIRలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌కు విచారణ అర్హత ఉంటుందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్‌పై నిషేధం ఉంటుందని పేర్కొంది.