News September 24, 2025
కొడంగల్: రోడ్డు వేసిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయింది: కేటీఆర్

కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొత్తగా వేసిన రోడ్డు ఒక్క భారీ వర్షంతో కొట్టుకుపోయింది. బొంరాస్‌పేట మండలం బాపల్లి నుంచి దౌల్తాబాద్ మండలం నందారం వరకు 13 కి.మీకి రూ.30 కోట్లు కేటాయించి నిర్మించిన రోడ్డు దెబ్బతింది. మంచి రోడ్డు కూడా నిర్మించలేని ప్రభుత్వం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టుల్లో చిన్న లోపాన్ని ప్రశ్నించడం విడ్డూరమని తన X ఖాతాలో KTR ఆరోపించారు.
Similar News
News September 24, 2025
డీఎస్సీ అభ్యర్థులకు భోజనం ఏర్పాట్లు: అనకాపల్లి డీఈవో

డీఎస్సీలో ఎంపికైనవారు అమరావతిలో ఈనెల 25న నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడ వెళుతున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు నుంచి 900 మంది, నక్కపల్లి నుంచి 2000 మంది బస్సుల్లో వెళుతున్నట్లు తెలిపారు. వీరికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీరితోపాటు ఎంఈఓలు వెళుతున్నారని అన్నారు.
News September 24, 2025
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. UPDATE

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి SRSP, కడెం ప్రాజెక్టుల నుంచి బుధవారం భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్ఫ్లో 5,36,021 క్యూసెక్కులు. ఔట్ఫ్లో 5,64,077 క్యూసెక్కులు. ప్రాజెక్ట్ సామర్థ్యం 20.175 TMCలు. ప్రస్తుతనిల్వ 17.0183 TMCలు. లెవెల్- 146. 85/148.00M. ప్రాజెక్టుకు 40గేట్ల ద్వారా 5,63,680లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 24, 2025
TTD అదనపు ఈవో తండ్రి మృతి

TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి చలమయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల కొందరు సంతాపం తెలిపారు.