News September 24, 2025
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలన్నారు. ఇంటి బయట లోపల ఒకటి లేదా రెండు లైట్లు వేసి ఉంచాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. సెలవులు ముగిసేంత వరకు కాలనీలలో సంక్షేమ సంఘాలు గస్తీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Similar News
News September 24, 2025
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

వాతావరణ శాఖ హెచ్చరికలతో రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టరు డాక్టర్ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News September 23, 2025
వైకుంఠం జ్యోతి ఎవరు?

ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. <<17795004>>వైకుంఠం<<>> ఫ్యామిలీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. జ్యోతి మామ శ్రీరాములు 1995లో KDCC బ్యాంకు ఛైర్మన్‌గా పనిచేశారు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. తర్వాత తనయుడు, జ్యోతి భర్త ప్రసాద్ 2011లో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు MLA టికెట్ ఆశించినా అవకాశం రాలేదు. పార్టీలోనే కొనసాగుతున్న ఆ ఫ్యామిలీకి మరోసారి ఇన్‌ఛార్జి పదవి దక్కింది.
News September 23, 2025
కర్నూలు రైల్వే స్టేషన్లో తనిఖీలు

కర్నూలు రైల్వే స్టేషన్లో టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగుల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాలు ఉన్నాయా అని స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి డ్రగ్స్ అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు.