News September 24, 2025
ఇవాళ తిరుమలకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి CBN దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ సా.6.20 గంటలకి తిరుమల చేరుకుంటారు. రా.7.40 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. రేపు ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం విజయవాడకు బయల్దేరుతారు.
Similar News
News September 24, 2025
GOLD: పదేళ్లలో దాదాపు రూ.లక్ష పెరిగింది

గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹72వేలుగా ఉండేది. ఇప్పుడు ₹1.16లక్షలకు చేరింది. అంటే 9 నెలల్లోనే ₹44వేలు పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం. 10గ్రా. బంగారం ధర 1970లో ₹184, 1975లో ₹540 మాత్రమే. 2005లో ₹7000 ఉండగా, 2015లో ₹26,343, 2020లో ₹50వేలు టచ్ చేసింది. కరోనా వల్ల ₹36వేలకు దిగొచ్చి తిరిగి పుంజుకుంది. పదేళ్లలో దాదాపు ₹లక్ష పెరిగింది.
News September 24, 2025
171 ఉద్యోగాలకు నోటిఫికేషన్

వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏతోపాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు 23-36 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 13. మరిన్ని వివరాలకు <
News September 24, 2025
మండలానికి ఒక జూనియర్ కాలేజీ: లోకేశ్

AP: మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ‘గత సర్కారు ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేసింది. హైస్కూల్ ప్లస్ విధానంతో కాలేజీల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా పోయారు. మేము ఆ విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రభుత్వ కాలేజీల్లో 40% అడ్మిషన్లు మెరుగుపర్చాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశాం’ అని చెప్పారు.