News September 24, 2025

కూకట్‌పల్లిలో ఇంట్లోకి వెళ్లి దాడి.. అక్రమ సంబంధమే కారణమా !

image

కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఇంట్లోకి చొరబడి భూపాల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళ వివాహేతర సంబంధంపై భూపాల్ అనుమానం వ్యక్తం చేశారు. 5ఏళ్ల క్రితం తమ పెళ్లి జరగ్గా, ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఉందని, ఆ విషయమై గొడవ జరగడంతో దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి ఆమె దాడి చేయించిందని భూపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 24, 2025

MBNR: GREAT.. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్

image

74వ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్ (ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్) 2025-26లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఉమెన్ PC రాధిక కాంస్య పతకం సాధించింది. హరియాణాలో ఈనెల 20 నుంచి 24 జరుగుతున్న క్రీడలలో తెలంగాణ పోలీస్ మహిళా ఆర్మ్ రెజ్లింగ్ క్రీడాకారిణి రాధికా (WPC పోలీస్ స్టేషన్ అడ్డకల్, MBNR) 80+ కేటగిరీలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించింది. SP డి.జానకి ఆమెను ప్రశంసించారు.
#CONGRATULATIONS

News September 24, 2025

OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?: వైసీపీ ఎమ్మెల్యే

image

AP: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘OG’పై వైసీపీ ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?’ అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై జనసైనికులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తాము 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించామని, వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా OG అంటే ఓజస్ గంభీర అని మేకర్స్ గతంలో ప్రకటించారు.

News September 24, 2025

గద్వాలలో రేపు బతుకమ్మ వేడుకలు

image

గద్వాలలోని తేరు మైదానంలో గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మహిళలు, చిన్నారులు, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. ఆకర్షణీయంగా బతుకమ్మ పేర్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.