News September 24, 2025

HYD: మూసీ వద్ద మహిళ మృతదేహం.. ముగ్గురి అరెస్ట్

image

మూసీ నది వద్ద లభ్యమైన మహిళా మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దుర్గారెడ్డి, గులామ్ దస్తగిర్ ఖాన్, మొహమ్మద్ ఇమ్రాన్‌లను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసి, కర్రలతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Similar News

News September 24, 2025

HYD డెవలప్‌మెంట్‌లో రేవంత్ vs KCR!

image

బతుకమ్మ కుంట చుట్టూ రాజకీయం మొదలైంది. బే‘కారు’ పాలన..‘ప్రజా’పాలనకు తేడా ఇదే అంటూ కాంగ్రెస్ నేతలు బతుకమ్మ కుంట వీడియోలు SMలో పోస్ట్ చేశారు. అయితే, KCR రంగదాముని చెరువు, మల్కంచెరువు, దుర్గం చెరువులను అభివృద్ధి చేసినా ప్రచారం చేసుకోలేదని BRS నేతల వాదన. 5 ఎకరాల కుంటను అభివృద్ధి చేసిన రేవంత్ గొప్పనా?.. ఎన్నో చెరువులను సుందరీకరించిన KCR గొప్పనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైదరాబాదీ కామెంట్?

News September 24, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి

image

HYD శివారు ఆదిభట్ల PS పరిధిలో దారుణం జరిగింది. RGK కుర్మల్‌గూడలో మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడి చేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News September 24, 2025

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు

image

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరారు. ADE దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. అంబేద్కర్ బినామీ ఇంట్లో గుర్తించిన రూ.2 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.