News September 24, 2025

దేవదేవుని దివ్యోత్సవాలకు సమయం ఆసన్నం

image

శ్రీవారి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. నేటి నుంచి అక్టోబరు 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగుతాయి. నేడు సాయంత్రం 5.43 నుంచి 6.15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. స్వామివారు నేడు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.

Similar News

News September 24, 2025

APPLY NOW.. NLCలో ఉద్యోగాలు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLC) 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్, హెల్త్ అండ్ శానిటేషన్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల ఉద్యోగ అనుభవం గలవారు OCT 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in/

News September 24, 2025

GROUP-1: సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

image

TG: గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట దక్కింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 15న చేపడతామని హైకోర్టు తెలిపింది. తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే పేర్కొన్నారు. 6 ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ గ్రూప్-1 GRLను రద్దు చేసిందని, వాటికి ఆధారాల్లేవని అడ్వకేట్ జనరల్ సీజే బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.

News September 24, 2025

పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారు: హరీశ్

image

TG: కృష్ణా జలాల వాటాలో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. వీళ్ల అజ్ఞానం వల్ల నీటి వాటాను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. 763 TMCలు ఇవ్వాలంటూ KCR గతంలో పట్టుబట్టారని గుర్తుచేశారు. CBNకు భయపడి బనకచర్లపై మౌనం వహించిన రేవంత్, ఇప్పుడు కర్ణాటకలోని INC ప్రభుత్వం కోసం ఆల్మట్టి ఎత్తు పెంపుపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.