News September 24, 2025

అలర్ట్.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు

image

TG: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. రేపు ఉ.8.30లోపు వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Similar News

News September 24, 2025

17 మంది విద్యార్థినులపై బాబా లైంగిక దాడి!

image

ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్‌లో EWS స్కాలర్‌షిప్‌తో చదువుతున్న 17మంది PG స్టూడెంట్స్ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. తమను దుర్భాషలాడేవాడని, అభ్యంతరకర మెసేజులు పంపేవాడని, శారీరకంగా కలవాలని బలవంతం చేసేవాడని వాపోయారు. ప్రస్తుతం ఆ బాబా పరారీలో ఉన్నాడు.

News September 24, 2025

‘డాక్టర్ అవ్వాలని లేదు’.. NEET ర్యాంకర్ సూసైడ్

image

మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన అనురాగ్ అనిల్ బోర్కర్ (19) అనే విద్యార్థి సూసైడ్ సంచలనంగా మారింది. మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేందుకు UP ఘోరఖ్‌పుర్ వెళ్లాల్సిన రోజే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు డాక్టర్ అవ్వాలని లేదు’ అని సూసైడ్ నోట్‌లో రాసుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనురాగ్ NEET UG- 2025 పరీక్షలో ఆల్ ఇండియా 1475(99.99 పర్సంటైల్) ర్యాంకు సాధించాడు.

News September 24, 2025

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఏ భాషనైనా ఇట్టే చదివేయొచ్చు!

image

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు ఇతర భాషల్లోని మెసేజ్‌లను కావాల్సిన భాషల్లోకి అనువదించుకోవచ్చు. దీనికోసం మెసేజ్‌పై నొక్కి పట్టుకుంటే ట్రాన్స్‌లేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ఏ భాషలోకి అనువదించాలో దానిని ఎంచుకోండి. ఆండ్రాయిడ్ యూజర్లు అన్ని మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. *తెలుగు ఇంకా అందుబాటులోకి రాలేదు.