News September 24, 2025

వైజాగ్‌కు మరో ప్రముఖ ఐటీ కంపెనీ?

image

AP: వైజాగ్‌కు మరో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్ రానుంది. నగరంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆ సంస్థ చూస్తున్నట్లు రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఎకరాకు 99పైసల చొప్పున పది ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే 12వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపింది. ఇప్పటికే <<17551159>>TCS<<>>, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో మరిన్ని టెక్ అనుబంధ సంస్థలు వచ్చే అవకాశముంది.

Similar News

News September 24, 2025

‘వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌’ లాంచ్ చేసిన జగన్

image

AP: కార్యకర్తల ఫిర్యాదు కోసం ‘వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌’ను పార్టీ చీఫ్ జగన్ లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు.

News September 24, 2025

గ్రామ, వార్డు సచివాలయ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

image

AP: గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీల విధుల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో డిజిటల్ సెక్రటరీయే విద్యాంశాలను చూస్తున్నారు. దీనివల్ల డిజిటల్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. తాజా బిల్లులో గ్రామ సచివాలయాల్లో మాదిరిగానే వార్డుల్లోనూ విద్యను వెల్ఫేర్ సెక్రటరీకి కేటాయిస్తున్నట్లు పొందుపరిచారు. దీనితో పాలనాపర సమస్యలు తొలగనున్నాయి.

News September 24, 2025

17 మంది విద్యార్థినులపై బాబా లైంగిక దాడి!

image

ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్‌లో EWS స్కాలర్‌షిప్‌తో చదువుతున్న 17మంది PG స్టూడెంట్స్ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. తమను దుర్భాషలాడేవాడని, అభ్యంతరకర మెసేజులు పంపేవాడని, శారీరకంగా కలవాలని బలవంతం చేసేవాడని వాపోయారు. ప్రస్తుతం ఆ బాబా పరారీలో ఉన్నాడు.