News September 24, 2025

SKLM: RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు

image

ITI పాస్ అయిన అభ్యర్థులు RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25లోగా డీజిల్, మెకానికల్, ట్రేడ్లలో ఉత్తీర్ణులైన వారు https://www.apprenticeshipindia.gov.on వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 10న విజయనగరం RTC ట్రైనింగ్ సెంటర్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

Similar News

News September 24, 2025

SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

image

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

ఎచ్చెర్ల: ‘ఈ నెల 25 నుంచి అంబేడ్కర్ యూనివర్సిటీకి దసరా సెలవులు’

image

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 9వ తేదీన తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమాచారాన్ని కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు గమనించాలని సూచించారు.