News September 24, 2025

అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు

image

వచ్చే నెల 1 నుంచి ఆధార్ సర్వీస్ ఛార్జీలు పెరగనున్నాయి. తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్‌కు ప్రస్తుతం రూ.50 ఉండగా రూ.75కు, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.100 ఉండగా రూ.125కు పెంచుతున్నట్లు UIDIA తెలిపింది. పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచినట్లు పేర్కొంది. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది.

Similar News

News September 24, 2025

5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల

image

జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో 4, పంజాబ్‌లో ఒక సీటు(ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.

News September 24, 2025

26న పేరెంట్-టీచర్ మీటింగ్

image

TG: అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో SEP 26న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలని తెలిపింది. పిల్లల చదువు, హాజరు, ప్రవర్తనపై చర్చించాలని సూచించింది. తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకోవాలంది. నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది.

News September 24, 2025

‘వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌’ లాంచ్ చేసిన జగన్

image

AP: కార్యకర్తల ఫిర్యాదు కోసం ‘వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌’ను పార్టీ చీఫ్ జగన్ లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు.