News September 24, 2025

దేశంలోనే తొలిసారి TTDలో అమలు

image

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-లోని 25వ కంపార్ట్మెంట్ వద్ద ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారి TTD ఆందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అలిపిరి నుంచే భక్తుల రద్దీని అంచనా వేస్తారు. క్యూ లైన్‌లో ఎంత మంది భక్తులు ఉన్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? తదితర అంశాలను ఏఐ గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిస్టంకు సమాచారం, 3డీ మ్యాప్, ఫొటోలు అందజేస్తుంది.

Similar News

News September 24, 2025

MDK: రా’జీవం’ లేని యువ వికాసం

image

రాజీవ్ యువ వికాస పథకం నేటికి అమలుకు నోచుకోలేదు. ఆశావహులు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా పురోగతి లేదు. ఇప్పుడిస్తాం.. అప్పడిస్తామంటూ ఆశ పెట్టి తమను ఆగం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. పైగా నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం. ఈ లోగా రుణాలిచ్చి ఉపాధికి మార్గం చూపాలని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 32,638 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News September 24, 2025

5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల

image

జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో 4, పంజాబ్‌లో ఒక సీటు(ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.

News September 24, 2025

WGL: ఆక్సిజన్ అందక MGMలో పసికందు మృతి

image

వరంగల్ MGM ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రెండు నెలల పసికందు మృతి చెందింది. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక శిశివు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఓ కుటుంబం శిశువును 3 రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకురాగా నేడు మృత్యువాత పడింది. ఆసుపత్రి నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.