News September 24, 2025

అమరావతి మునిగిపోయిందని పోస్టు చేసిన ఉద్యోగి సస్పెండ్

image

AP: అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం’ అని AUG 19న పోస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి పోస్టులు వ్యక్తిగతం కావని, ప్రజలను ప్రభావితం చేయడంతో పాటు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Similar News

News September 24, 2025

సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి: నాని

image

AP: జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం’ అని తాడేపల్లిలో తెలిపారు. కాగా జగన్ అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలో YCP విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.

News September 24, 2025

తల్లి నిరాకరిస్తే.. అత్త కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది!

image

అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం చూస్తుంటాం. అయితే కోడళ్లను కూతురిలా చూసుకునే అత్తలు కూడా ఉన్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. యూపీలోని ఎటాలో ఓ అత్త తన కోడలి ప్రాణాలు కాపాడటానికి తన కిడ్నీని దానం చేసి మానవత్వం చాటారు. ఆమె సొంత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించారు. అత్త మాత్రం ‘ఆమె నాకు కోడలు కాదు, కన్న కూతురితో సమానం’ అంటూ కోడలికి కిడ్నీ ఇచ్చి కాపాడుకున్నారు.

News September 24, 2025

కశ్మీర్ లోయలో ఫ్యాషన్ చుక్క ఇక్రా అహ్మద్

image

సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుతున్నారు కశ్మీర్‌కు చెందిన ఇక్రా అహ్మద్. ఆ రాష్ట్రంలో Tul Palav అనే తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను నెలకొల్పి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కుర్తాలు, వెడ్డింగ్ డ్రెస్సులతో ఆకట్టుకుంటున్నారు. లోయలో అస్థిర పరిస్థితులను తట్టుకుని, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.