News September 24, 2025
ఇక ఆ 29 సారా రహిత గ్రామాలు: కలెక్టర్

‘నవోదయం’ కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 8 మండలాల్లోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఓ మాధవి పాల్గొన్నారు.
Similar News
News September 24, 2025
సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి: నాని

AP: జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం’ అని తాడేపల్లిలో తెలిపారు. కాగా జగన్ అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలో YCP విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.
News September 24, 2025
మంచిర్యాల: విదేశీ విద్యా నిధి కోసం దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు దుర్గాప్రసాద్ తెలిపారు. షెడ్యూల్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీలోగా www.telangana.epass.cgg.giv.inలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు.
News September 24, 2025
నిన్న దుర్గమ్మ ఆదాయం రూ.31.08 లక్షలు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంకు మంగళవారం రూ. 31,08,645 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.300, రూ.100 టికెట్ల ద్వారా, లడ్డూ ప్రసాదాలు, ప్రత్యేక కుంకుమార్చన, కేశఖండనశాల, అమ్మవారి ఫోటో, క్యాలెండర్ విక్రయాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. నిన్న అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.