News September 24, 2025

BHPL: బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీనివాస్ రెడ్డికి బంగారు పతకం

image

సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటికే-6వ గని కోల్ కట్టర్ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి బంగారు పతకం సాధించాడు. గతంలో మిస్టర్ సింగరేణి, మిస్టర్ తెలంగాణ టైటిల్, కోల్ ఇండియా వంటి వాటిలో శ్రీనివాస్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. భూపాలపల్లి సింగరేణి ఏరియాకు బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల తోటి కార్మికులు అతడిని అభినందించారు.

Similar News

News September 24, 2025

BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

image

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

News September 24, 2025

OG మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

image

TG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన OG చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గం.కు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.

News September 24, 2025

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు

image

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరారు. ADE దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. అంబేద్కర్ బినామీ ఇంట్లో గుర్తించిన రూ.2 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.