News September 24, 2025

అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ

image

దేవీ శరన్నవరాత్రులలో మూడో రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆహార, పోషణకు ప్రతీక అయిన ఈ అలంకారంలో అమ్మవారు స్వర్ణపాత్ర, బంగారు త్రిశూలం, అభయహస్తాలతో అలరారుతూ కనులవిందు చేశారు. ఈ రూపంలో దుర్గమ్మను పూజిస్తే అన్నానికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం.

Similar News

News September 24, 2025

పేరూరు డిగ్రీ కళాశాల అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

image

అమలాపురం మండలం పేరూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రకాల వసతులతో సౌకర్యవంతంగా నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఎస్ఎస్ కంపెనీ ఆర్కిటెక్ట్స్ కార్తీక్, కాంట్రాక్టర్ యాదగిరి, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజినీర్ రాజకుమార్‌లతో సమావేశమయ్యారు. భవన నిర్మాణ అంశాలపై క్షుణ్ణంగా చర్చించి, మ్యాపులను పరిశీలించారు.

News September 24, 2025

RGM: ‘కాంట్రాక్టు కార్మికులకు 15% వాటా ఇవ్వాలి’

image

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంస్థ సాధించిన లాభాలలో 15% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. IFTU ఆధ్వర్యంలో రామగుండం డివిజన్‌లోని వివిధ డిపార్ట్మెంట్ లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఈ నరేష్, రాజేశం మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజేందర్, కిష్టయ్య, రాజు, కృష్ణ పాల్గొన్నారు.

News September 24, 2025

HYD: ‘విశ్వనగరం అంటే నవ్వుతున్నారు..!’

image

HYDను విశ్వనగరం చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని, కానీ ఒకసారి కార్లు దిగి రోడ్ల పరిస్థితి చూడాలని ప్రజలు అంటున్నారు. ఉప్పల్-నారపల్లి, JBS-కార్ఖానా-అల్వాల్, బంజారాహిల్స్ తదితర చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. రోడ్లను చూసి విశ్వనగరం అంటే బయట నవ్వుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఏడాదిగా అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.