News September 24, 2025
నేలకొండపల్లి యాక్సిడెంట్ UPDATE

నేలకొండపల్లిలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<17808359>>ఇద్దరు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కొరట్లగూడేనికి చెందిన మనోజ్(18), సన్నీప్రసాద్(17) బంధువులు. రాత్రి నేలకొండపల్లి నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం.
Similar News
News September 24, 2025
ఇప్పటికే కొన్న OG టికెట్స్ పరిస్థితి ఏంటి?

TG: రేపు విడుదలకానున్న పవన్ OG మూవీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు GOను <<17815121>>TG హైకోర్టు<<>> సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న తలెత్తింది. రేపటికి దాదాపుగా అన్ని షోలకు టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో టికెట్ల డబ్బులు, అన్ని టికెట్లకు పెంచిన ధరలను రిఫండ్ చేస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News September 24, 2025
GDK: ‘గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దు’

గోదావరిఖని పట్టణంలోని స్కానింగ్ సెంటర్‌లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలలో నిర్వహిస్తున్న రికార్డులు, నమోదులు, ఫారం-Fలను పరిశీలించారు. స్కానింగ్ మిషన్‌లో రెండేళ్ళ స్టోరేజ్ డేటా ఉండాలన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించవద్దని సూచించారు. ప్రతినెల ఫారం – F లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపించాలన్నారు.
News September 24, 2025
పేరూరు డిగ్రీ కళాశాల అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

అమలాపురం మండలం పేరూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రకాల వసతులతో సౌకర్యవంతంగా నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఎస్ఎస్ కంపెనీ ఆర్కిటెక్ట్స్ కార్తీక్, కాంట్రాక్టర్ యాదగిరి, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజినీర్ రాజకుమార్‌లతో సమావేశమయ్యారు. భవన నిర్మాణ అంశాలపై క్షుణ్ణంగా చర్చించి, మ్యాపులను పరిశీలించారు.