News September 24, 2025

GNT: శకుని పాత్రకు ప్రాణం పోసిన మన ధూళిపాళ

image

తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లిలో 1922 సెప్టెంబర్ 24న జన్మిచారు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి. ఆయన పేరు చెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది.

Similar News

News September 24, 2025

RGM: ‘కాంట్రాక్టు కార్మికులకు 15% వాటా ఇవ్వాలి’

image

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంస్థ సాధించిన లాభాలలో 15% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. IFTU ఆధ్వర్యంలో రామగుండం డివిజన్‌లోని వివిధ డిపార్ట్మెంట్ లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఈ నరేష్, రాజేశం మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజేందర్, కిష్టయ్య, రాజు, కృష్ణ పాల్గొన్నారు.

News September 24, 2025

HYD: ‘విశ్వనగరం అంటే నవ్వుతున్నారు..!’

image

HYDను విశ్వనగరం చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని, కానీ ఒకసారి కార్లు దిగి రోడ్ల పరిస్థితి చూడాలని ప్రజలు అంటున్నారు. ఉప్పల్-నారపల్లి, JBS-కార్ఖానా-అల్వాల్, బంజారాహిల్స్ తదితర చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. రోడ్లను చూసి విశ్వనగరం అంటే బయట నవ్వుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఏడాదిగా అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.