News September 24, 2025

24 నెలల్లో అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ..?

image

అమరావతి ప్రాంతంలో 24 నెలల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి లోకేశ్ ఇందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో చెప్పారు. లైబ్రరీ అభివృద్ధికి శోభా డెవలపర్స్ రూ.100 కోట్లు హామీ ఇచ్చారని, మంగళగిరిలో ఏకంగా అక్టోబర్‌లో మోడల్ లైబ్రరీ ప్రారంభించనున్నట్లు సమాచారం. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ & భౌతిక లైబ్రరీలలో అవసరమైన అన్ని పుస్తకాలు లభిస్తాయి.

Similar News

News September 24, 2025

ANU PG ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన PG రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.SC ఎన్విరాన్మెంటల్ సైన్స్ 16/16 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 7లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1860లు, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2190లు చెల్లించాలన్నారు.

News September 24, 2025

గుంటూరులో దొంగలు అరెస్ట్

image

పాతగుంటూరులో చోటుచేసుకున్న దొంగతనం ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు ఇంట్లోని బీరువా పగులగొట్టి రూ.2.40 లక్షలు దొంగలించిన కేసులో CI వెంకట ప్రసాద్, SI అబ్దుల్ రెహమాన్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో వారిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రూ.2.10 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించారు.

News September 24, 2025

ఉమ్మడి జిల్లాలో ఆస్తి పన్ను పెంపు లక్ష్యం

image

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మున్సిపాల్టీల ఆస్తి పన్ను ఆదాయం రూ.258.95 కోట్లు ఉండగా, దీనిపై 20శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. దీంతో రూ.52 కోట్లు అదనంగా రాబట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంటింటి సర్వేలు ప్రారంభమయ్యాయి. గతంలో జరిగిన అక్రమాలు, తప్పు కొలతల కారణంగా పన్ను నష్టం వాటిల్లిందని గుర్తించిన అధికారులు, ఈసారి పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నారు.