News September 24, 2025

తిరుమలలో AI సేవలు.. రేపు ప్రారంభించనున్న CM CBN

image

తిరుమలలో ఇకపై AI సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్-లోని 25వ కంపార్ట్‌మెంట్ వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని CM చంద్రబాబు రేపు ప్రారంభిస్తారు. అలిపిరి వద్ద అమర్చిన సీసీ కెమెరాలతో ఈ టెక్నాలజీ భక్తుల రద్దీని అంచనా వేసి అధికారులను అలర్ట్ చేస్తుంది. వసతి, భక్తుల భద్రత, ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం కట్టడికి ఇది ఉపయోగపడుతుంది.

Similar News

News September 24, 2025

12 రోజుల్లో ₹140 కోట్లకు పైగా కలెక్షన్స్

image

తేజా సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నార్త్ అమెరికా కలెక్షన్స్ $3M (రూ.26కోట్లు)కి చేరువలో ఉన్నట్లు తెలిపింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.

News September 24, 2025

బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం వాయిదా

image

TG: ఈ నెల 28న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.

News September 24, 2025

చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంపై 15 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. ‘చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయినా బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ఎవరూ ఉండరు. YCP హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తోంది’ అని పార్టీ సమావేశంలో ఆరోపించారు.