News September 24, 2025

గజలక్ష్మి దేవి రూపంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

image

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గజలక్ష్మి దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. గజలక్ష్మి అంటే ఏనుగులతో ఉన్న లక్ష్మి దేవత అని అర్థం. ఈ మాత లక్ష్మీదేవి, అష్టలక్ష్మి రూపాలలో ఒకటి. ఈ రూపంలో ఆమె పద్మాసనంపై కూర్చుని, ఇరువైపులా ఏనుగులు తొండాలతో ఆమెపై నీటిని పోస్తూ ఉంటారు. గజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే శ్రేయస్సు, సంపద, అదృష్టం, కలుగుతుందని భక్తుల నమ్మకం.

Similar News

News September 24, 2025

HYD: BRS వాళ్లవి నీచపు రాజకీయాలు: సామ రామ్మోహన్ రెడ్డి

image

గ్రూప్-1 ర్యాంకర్లపై BRS వాళ్లు నీచపు రాజకీయాలు చేస్తున్నారని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. కష్టపడి చదివి ర్యాంకులు కొట్టిన ర్యాంకర్లపై BRS, BJP వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రివ్యాల్యుయేషన్‌పై కోర్టులో చర్చ నడుస్తుంటే రూ.3 కోట్లకు జాబ్‌లు అమ్ముకున్నారంటూ BRS వాళ్లు అభ్యర్థుల జీవితాలను రోడ్లపై పడేశారంటూ పేర్కొన్నారు.

News September 24, 2025

HYD: ‘విశ్వనగరం అంటే నవ్వుతున్నారు..!’

image

HYDను విశ్వనగరం చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని, కానీ ఒకసారి కార్లు దిగి రోడ్ల పరిస్థితి చూడాలని ప్రజలు అంటున్నారు. ఉప్పల్-నారపల్లి, JBS-కార్ఖానా-అల్వాల్, బంజారాహిల్స్ తదితర చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. రోడ్లను చూసి విశ్వనగరం అంటే బయట నవ్వుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఏడాదిగా అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 24, 2025

HYD డెవలప్‌మెంట్‌లో రేవంత్ vs KCR!

image

బతుకమ్మ కుంట చుట్టూ రాజకీయం మొదలైంది. బే‘కారు’ పాలన..‘ప్రజా’పాలనకు తేడా ఇదే అంటూ కాంగ్రెస్ నేతలు బతుకమ్మ కుంట వీడియోలు SMలో పోస్ట్ చేశారు. అయితే, KCR రంగదాముని చెరువు, మల్కంచెరువు, దుర్గం చెరువులను అభివృద్ధి చేసినా ప్రచారం చేసుకోలేదని BRS నేతల వాదన. 5 ఎకరాల కుంటను అభివృద్ధి చేసిన రేవంత్ గొప్పనా?.. ఎన్నో చెరువులను సుందరీకరించిన KCR గొప్పనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైదరాబాదీ కామెంట్?