News September 24, 2025
వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు.. సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్లు

TG: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ తొలి వారం నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు 74.99 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ, తరుగు, టార్పాలిన్లు, గన్నీ సంచుల్లో సమస్యలు ఎదురైతే రైతులు 1967, 180042500333 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
Similar News
News September 24, 2025
వైద్య కళాశాలలు ధారాదత్తం చేయట్లేదు: సత్యకుమార్

AP: ప్రైవేటీకరణకు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌కు తేడా తెలియని వ్యక్తి గతంలో CMగా చేయడం దౌర్భాగ్యమని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మండలిలో మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘భూమి యాజమాన్యం హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడతారు. కళాశాలలపై పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కాలేజీలను ఎవరికీ ధారాదత్తం చేయట్లేదు’ అని తెలిపారు.
News September 24, 2025
12 రోజుల్లో ₹140 కోట్లకు పైగా కలెక్షన్స్

తేజా సజ్జ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నార్త్ అమెరికా కలెక్షన్స్ $3M (రూ.26కోట్లు)కి చేరువలో ఉన్నట్లు తెలిపింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
News September 24, 2025
బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం వాయిదా

TG: ఈ నెల 28న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.