News September 24, 2025
కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి

TG: పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన కొత్తగూడెం(D)లో జరిగింది. ఏడూళ్లబయ్యారానికి చెందిన సందీప్ (25) 2 నెలల క్రితం కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. మచ్చిక చేసుకుంటుండగా అది తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క కాలి గోరు సందీప్‌కు గుచ్చుకుంది. తండ్రికి చికిత్స చేయించిన అతడు తన గాయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇటీవల రేబీస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయాడు.
Similar News
News September 24, 2025
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: ఉప రాష్ట్రపతి

AP: ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విజయవాడ ముందు వరుసలో ఉందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు వెళ్లారు.
News September 24, 2025
జగన్ పిటిషన్‌పై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

AP: LoPగా తనను గుర్తించేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమని, ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేసింది. సభాపతి అయ్యన్న, సభా వ్యవహారాల మంత్రి కేశవ్, కార్యదర్శికి కోర్టు నోటీసులిచ్చింది. విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.
News September 24, 2025
వైద్య కళాశాలలు ధారాదత్తం చేయట్లేదు: సత్యకుమార్

AP: ప్రైవేటీకరణకు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌కు తేడా తెలియని వ్యక్తి గతంలో CMగా చేయడం దౌర్భాగ్యమని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మండలిలో మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘భూమి యాజమాన్యం హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడతారు. కళాశాలలపై పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కాలేజీలను ఎవరికీ ధారాదత్తం చేయట్లేదు’ అని తెలిపారు.