News September 24, 2025
డీఎస్సీ అభ్యర్థులకు భోజనం ఏర్పాట్లు: అనకాపల్లి డీఈవో

డీఎస్సీలో ఎంపికైనవారు అమరావతిలో ఈనెల 25న నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడ వెళుతున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు నుంచి 900 మంది, నక్కపల్లి నుంచి 2000 మంది బస్సుల్లో వెళుతున్నట్లు తెలిపారు. వీరికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీరితోపాటు ఎంఈఓలు వెళుతున్నారని అన్నారు.
Similar News
News September 24, 2025
వైద్య కళాశాలలు ధారాదత్తం చేయట్లేదు: సత్యకుమార్

AP: ప్రైవేటీకరణకు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌కు తేడా తెలియని వ్యక్తి గతంలో CMగా చేయడం దౌర్భాగ్యమని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మండలిలో మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘భూమి యాజమాన్యం హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడతారు. కళాశాలలపై పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కాలేజీలను ఎవరికీ ధారాదత్తం చేయట్లేదు’ అని తెలిపారు.
News September 24, 2025
భద్రాద్రి: నిశీధిలో అడవి బిడ్డల బతుకులు

అడవి బిడ్డల బతుకులు మారడం లేదని సామాజిక కార్యకర్త కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. కరకగూడెం మండలం అంగూరిగూడెం గ్రామంలో దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేదని, దీంతో రాత్రిపూట పాములు, అడవి జంతువుల సంచారంతో గ్రామస్థులు భయపడుతున్నారని తెలిపారు. ఐటీడీఏ అధికారులు స్పందించి రోడ్డు, విద్యుత్, నీటి వసతి కల్పించి వారి బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు.
News September 24, 2025
నరసరావుపేట: ‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

ఏపీలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని AIYF జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ..నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గ్రూప్ – 1,2 నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలిపారు.