News September 24, 2025

OCT 3 నుంచి రేషన్ షాపుల బంద్‌కు నిర్ణయం

image

TG: కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 3 నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు. 1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 6 నెలల కమీషన్ రూ.120 కోట్లతో పాటు గన్నీ బ్యాగుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించి రూ.15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని ఆయన వివరించారు.

Similar News

News September 24, 2025

విమానం టైర్ల వద్ద కూర్చొని ప్రయాణించింది ఇతడే

image

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన 13ఏళ్ల బాలుడి ఫొటో బయటకొచ్చింది. ఇరాన్‌కు పారిపోయేందుకు అతను ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో <<17798595>>కూర్చొని<<>> ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. అతను తనతో పాటు ఓ చిన్న ఆడియో స్పీకర్‌ను తెచ్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ప్రయాణిస్తే ఎలా ఉంటుందనే క్యూరియాసిటీతోనే టైర్ల వద్ద కూర్చున్నట్లు పిల్లాడు తెలిపాడు.

News September 24, 2025

‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా HYD: మంత్రి శ్రీధర్

image

TG: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘HCA హెల్త్‌కేర్’ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(GCC)ను ఆయన ప్రారంభించారు. ‘HCA హెల్త్‌కేర్ ప్రధానంగా US, UKలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడ ₹620 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం 1,200, 2026 నాటికి 3,000 ఉద్యోగాలు లభిస్తాయి’ అని చెప్పారు.

News September 24, 2025

మైథాలజీ క్విజ్ – 15 సమాధానాలు

image

1. రామ-రావణ యుద్ధంలో రాముని రథసారథి ‘మాతలి’.
2. గాంధారి తండ్రి ‘సుబలుడు’.
3. బలరాముడి తల్లి ‘రోహిణి’. దైవిక జోక్యం వల్ల బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి బదిలీ అవుతాడని గ్రంథాలు చెబుతున్నాయి.
4. కేదార్‌నాథ్ దేవాలయం ‘మందాకిని’ నది ఒడ్డున ఉంది.
5. తైపూసం అనే పండుగను ‘తమిళనాడు’ రాష్ట్రంలో జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>