News September 24, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి

image

HYD శివారు ఆదిభట్ల PS పరిధిలో దారుణం జరిగింది. RGK కుర్మల్‌గూడలో మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడి చేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News September 24, 2025

HYD: 8 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ

image

బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ CID కీలక ఆపరేషన్ నిర్వహించింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్ట్ చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా 007, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365 బెట్టింగ్, వీఎల్ బుక్, తెలుగు 365, యస్ 365 యాప్‌లను ఈ ముఠా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

News September 24, 2025

HYD: మియాపూర్‌లో విషాదం.. యువకుడి మృతి

image

HYD మియాపూర్ PS పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా యెనెకుంట తండా వాసి బానోత్ నగేశ్(35) HYD వచ్చి ప్లంబింగ్ పనిచేస్తూ మియాపూర్ పరిధి లక్కీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News September 24, 2025

HYD: BRS వాళ్లవి నీచపు రాజకీయాలు: సామ రామ్మోహన్ రెడ్డి

image

గ్రూప్-1 ర్యాంకర్లపై BRS వాళ్లు నీచపు రాజకీయాలు చేస్తున్నారని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. కష్టపడి చదివి ర్యాంకులు కొట్టిన ర్యాంకర్లపై BRS, BJP వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రివ్యాల్యుయేషన్‌పై కోర్టులో చర్చ నడుస్తుంటే రూ.3 కోట్లకు జాబ్‌లు అమ్ముకున్నారంటూ BRS వాళ్లు అభ్యర్థుల జీవితాలను రోడ్లపై పడేశారంటూ పేర్కొన్నారు.