News September 24, 2025
ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం

AP: అసెంబ్లీలో 3 బిల్లుల(SC వర్గీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ)కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 12 కులాలకు 1%, గ్రూప్-2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్-3లోని 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలవనుంది. అలాగే నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లూ ఆమోదం పొందింది.
Similar News
News September 24, 2025
విమానం టైర్ల వద్ద కూర్చొని ప్రయాణించింది ఇతడే

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన 13ఏళ్ల బాలుడి ఫొటో బయటకొచ్చింది. ఇరాన్‌కు పారిపోయేందుకు అతను ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో <<17798595>>కూర్చొని<<>> ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. అతను తనతో పాటు ఓ చిన్న ఆడియో స్పీకర్‌ను తెచ్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ప్రయాణిస్తే ఎలా ఉంటుందనే క్యూరియాసిటీతోనే టైర్ల వద్ద కూర్చున్నట్లు పిల్లాడు తెలిపాడు.
News September 24, 2025
‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా HYD: మంత్రి శ్రీధర్

TG: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘HCA హెల్త్‌కేర్’ సంస్థ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(GCC)ను ఆయన ప్రారంభించారు. ‘HCA హెల్త్‌కేర్ ప్రధానంగా US, UKలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడ ₹620 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం 1,200, 2026 నాటికి 3,000 ఉద్యోగాలు లభిస్తాయి’ అని చెప్పారు.
News September 24, 2025
మైథాలజీ క్విజ్ – 15 సమాధానాలు

1. రామ-రావణ యుద్ధంలో రాముని రథసారథి ‘మాతలి’.
2. గాంధారి తండ్రి ‘సుబలుడు’.
3. బలరాముడి తల్లి ‘రోహిణి’. దైవిక జోక్యం వల్ల బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి బదిలీ అవుతాడని గ్రంథాలు చెబుతున్నాయి.
4. కేదార్‌నాథ్ దేవాలయం ‘మందాకిని’ నది ఒడ్డున ఉంది.
5. తైపూసం అనే పండుగను ‘తమిళనాడు’ రాష్ట్రంలో జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>