News September 24, 2025
రేబీస్ లక్షణాలు కనిపిస్తే బతకడం కష్టమే!

కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు (జ్వరం, తలనొప్పి, బలహీనత, అయోమయం, నీటిని చూసి భయపడటం) కనిపిస్తే రక్షించడం అసాధ్యమని పేర్కొంటున్నారు. కుక్క కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ఆఖరుకు కుక్క <<17811521>>గోరు<<>> గుచ్చుకున్నా నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయాలని సూచిస్తున్నారు.
Similar News
News February 8, 2026
US వీసా టెన్షన్: డాలర్ డ్రీమ్స్‌లో ‘డార్క్’ డేస్!

USలో సెటిల్ అవ్వాలనే డ్రీమ్‌తో వెళ్లిన ఇండియన్స్‌కు వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. H1B ఎక్స్‌టెన్షన్స్ పై నిఘా పెరగడం, వీసా స్లాట్లు కూడా దొరక్కపోవడంతో ముఖ్యంగా F-1 స్టూడెంట్స్ భవిష్యత్తు గందరగోళంగా మారింది. దశాబ్దాల తరబడి సాగుతున్న గ్రీన్ కార్డ్ వెయిటింగ్, జాబ్ పోతే స్టేటస్ పోతుందనే భయం వంటివి తీవ్రమైన మెంటల్ ప్రెజర్‌కు దారితీస్తున్నాయి. కొందరు పెళ్లి ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారు.
News February 8, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలై లామా పేరు!

లైంగిక నేరగాడు <<19009352>>ఎప్‌స్టీన్ ఫైల్స్<<>>లో టిబెట్ మత గురువు దలై లామా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా 169 సార్లు ప్రస్తావించినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఆఫీసు స్పందించింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో దలై లామాను లింక్ చేయాలని కొన్ని మీడియా సంస్థలు, SM హ్యాండిల్స్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎప్‌స్టీన్‌ను ఆయన ఎన్నడూ కలవలేదు. సమావేశం కాలేదు. అతడితో మాట్లాడలేదు’ అని స్పష్టంచేసింది.
News February 8, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు

<


