News September 24, 2025

అక్టోబర్ 16 నుంచి కేయూ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియం త్రణాధికారి డా.ఎమీ అసీం ఇక్బాల్ మంగళవారం తెలిపారు. అక్టోబరు 16, 18, 22, 24, 27, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

Similar News

News September 24, 2025

GWL:GST తగ్గింపు పేద ప్రజలకు వరం-MP డీకే అరుణ

image

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం గద్వాలలో షాపింగ్ మాల్స్, వాహనాల షోరూం లు సందర్శించి జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులు పొందుతున్న బెనిఫిట్స్ అడిగి తెలుసుకున్నారు. బైకులు, కార్ల షోరూం నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో విక్రయాలు జరపాలని సూచించారు. పాత ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

News September 24, 2025

MHBD: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు

image

MHBD జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడిగా (ED) ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో జిల్లా మైనార్టీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, యువజన, క్రీడల, డోర్నకల్ మున్సిపల్ కమిషనర్‌గా మొదలు ఉన్నత హోదాల్లో శ్రీనివాసరావు విధులు నిర్వహించారు.

News September 24, 2025

విమానం టైర్ల వద్ద కూర్చొని ప్రయాణించింది ఇతడే

image

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన 13ఏళ్ల బాలుడి ఫొటో బయటకొచ్చింది. ఇరాన్‌కు పారిపోయేందుకు అతను ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో <<17798595>>కూర్చొని<<>> ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. అతను తనతో పాటు ఓ చిన్న ఆడియో స్పీకర్‌ను తెచ్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ప్రయాణిస్తే ఎలా ఉంటుందనే క్యూరియాసిటీతోనే టైర్ల వద్ద కూర్చున్నట్లు పిల్లాడు తెలిపాడు.