News September 24, 2025

చదువుకునేందుకు వయసు అడ్డురాలేదు!

image

ఆ ఊరిలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా భుజాన బ్యాగు ధరించి స్కూళ్లకు వెళ్తుంటారు. మహారాష్ట్ర, థానేలోని ఫంగానే గ్రామంలో ‘ఆజిబాయిచి శాల’ అనే పాఠశాల ఉంది. ఇక్కడ వృద్ధ మహిళలకు చదువు బోధిస్తారు. ఇలా ఒకప్పుడు అక్షరాలకు దూరమైన అవ్వల చేతులు ఇప్పుడు అక్షరాల లోకాన్ని తాకుతున్నాయి. ఓ వృద్ధురాలు పవిత్ర గ్రంథాలను చదవాలన్న కోరిక నుంచి పుట్టిన ఈ బడిలో ఇప్పుడు ఎంతోమంది రోజుకు రెండు గంటలు చదువు నేర్చుకుంటున్నారు.

Similar News

News September 24, 2025

పహల్గాం ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!

image

పహల్గాం ఉగ్రదాడిలో టెర్రరిస్టులకు సాయం చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని J&K పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆపరేషన్ మహదేవ్‌లో ఇటీవల పలువురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఘటనాస్థలిలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను బేస్ చేసుకొని మహ్మద్ కటారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇతడి అరెస్టు కీలకమని పోలీసులు భావిస్తున్నారు.

News September 24, 2025

CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే

image

CBSE 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారైంది. 10వ తరగతి పరీక్షలు 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయని బోర్డు ప్రకటించింది. ఈసారి 10, 12 తరగతుల పరీక్షలకు దాదాపు 45 లక్షల మంది హాజరవుతారని పేర్కొంది. పూర్తి వివరాలకు <>www.cbse.gov.in<<>> సైట్ చూడండి.

News September 24, 2025

SM యాప్స్ భారత చట్టాలను పాటించాల్సిందే: కర్ణాటక హైకోర్టు

image

X, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ భారత చట్టాలను పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని ఖాతాలు, పోస్ట్‌లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ X దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేసింది. ‘నియంత్రణ, పర్యవేక్షణ లేకుండా SM యాప్‌లను అనుమతించడం కుదరదు. ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ భారతీయులకు మాత్రమే ఉంది. విదేశీ సంస్థలకు కాదు’ అని ధర్మాసనం పేర్కొంది.