News September 24, 2025
వేధింపులకు చెక్ పెట్టాలంటే..

ప్రస్తుతకాలంలో చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం చాలామంది మహిళలు ఉన్న ఊరు వదిలి, అందరికీ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకతాయిల వేధింపులకు గురవుతుంటారు. వీరి కోసం ప్రభుత్వం కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. గృహ హింస, వరకట్నం బాధితులైతే 181, మహిళల అక్రమరవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 1098 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News September 24, 2025
CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే

CBSE 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారైంది. 10వ తరగతి పరీక్షలు 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయని బోర్డు ప్రకటించింది. ఈసారి 10, 12 తరగతుల పరీక్షలకు దాదాపు 45 లక్షల మంది హాజరవుతారని పేర్కొంది. పూర్తి వివరాలకు <
News September 24, 2025
SM యాప్స్ భారత చట్టాలను పాటించాల్సిందే: కర్ణాటక హైకోర్టు

X, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ భారత చట్టాలను పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని ఖాతాలు, పోస్ట్‌లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ X దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేసింది. ‘నియంత్రణ, పర్యవేక్షణ లేకుండా SM యాప్‌లను అనుమతించడం కుదరదు. ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ భారతీయులకు మాత్రమే ఉంది. విదేశీ సంస్థలకు కాదు’ అని ధర్మాసనం పేర్కొంది.
News September 24, 2025
ప్యాకేజ్ ఇస్తే చాలన్నట్లు పవన్ తీరు: రోజా

AP: తన మూవీ టికెట్ రేట్లు పెంచితే చాలు ప్రజలేమైనా పర్లేదన్నట్లు Dy.CM పవన్ తీరుందని మాజీమంత్రి రోజా విమర్శించారు. ‘రైతు మద్దతు ధరలేక అల్లాడుతుంటే పవన్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్యాకేజ్ ఇస్తే చాలు, సినిమా రేట్లు పెంచితే చాలన్నట్లు ఉన్నారు. ఒకసారి గెలిపించండి తలరాతలు మారుస్తానని అడుక్కొని గెలిచారు. ఏ ఒక్క వర్గానికైనా ఉపయోగపడ్డారా? షూటింగ్స్ చేసుకోక మీకెందుకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు.