News September 24, 2025

గుంటూరు జిల్లాలో రెండు కీలక పదవులపై ఉత్కంఠ

image

గుంటూరు జిల్లాలో మిర్చి యార్డు ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవులు ఇంకా ఖాళీగానే ఉండటంతో నేతల్లో ఆసక్తి నెలకొంది. రూ.1000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగే యార్డు ఛైర్మన్ స్థానం ప్రతిష్టాత్మకమైందిగా భావించబడుతోంది. ఈ పీఠం కోసం పలువురు పోటీలో ఉన్నారు. మరోవైపు జిల్లా అధ్యక్ష బాధ్యతలు బీసీలకు ఇవ్వాలన్న ఆలోచనపై పార్టీ అధిష్ఠానం చర్చిస్తున్నట్లు సమాచారం. దసరా నాటికి ఈ రెండు పదవులపై స్పష్టత రానుంది.

Similar News

News September 24, 2025

KMR: అంబేడ్కర్‌ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి పి.వెంకటేష్ తెలిపారు. డిగ్రీలో 60% మార్కులు సాధించిన విద్యార్థులు నవంబర్ 19, 2025 లోపు http://www.Telangana epass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News September 24, 2025

PU.. సౌత్ జోన్ ఆర్చరి జట్టు ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో ఆర్చరి పురుషుల విభాగంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఎంపికలు నిర్వహించామని యూనివర్సిటీ పీడీ.వై.శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ ఉపకులపతి(VC) జి ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు మాట్లాడుతూ.. క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News September 24, 2025

పోలవరం ఎడమ కాలువ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం అధికారులను ఆదేశించారు. పాయకరావుపేట వద్ద జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. చేయాల్సిన పని, కాల పరిమితి, కార్యాచరణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 21.77 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 11.25 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిగాయన్నారు.