News September 24, 2025
కడప: ప్లాన్ ప్రకారమే వడ్డీ వ్యాపారి హత్య?

కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి హత్య సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డిని పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన నుంచి అప్పులు తీసుకున్న వారే హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
Similar News
News September 24, 2025
ప్రొద్దుటూరు: ప్రారంభమైన ఎగ్జిబిషన్

ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా పండుగ సమయంలో ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.35, పిల్లలకు రూ.25గా పేర్కొన్నారు. ఇక పార్కింగ్ ఫీజు టూ వీలర్‌కు రూ.10, ఫోర్ వీలర్‌కు రూ.20లుగా నిర్ణయించారు.
NOTE: GST అదనం
News September 24, 2025
వివేకా హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారు: ఆది

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడలో మాట్లాడారు. ‘వివేకా హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారు. ఆయనకు సభా హక్కుల నోటీసు ఇస్తాం. హంతకులతో కుమ్మక్కైన శంకరయ్యపై విచారణ జరిపి డీజీపీ చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. వివేకా హత్య రక్తం మరకలు కడుగుతుంటే శంకయ్య ఏం చేశాడని ప్రశ్నించారు.
News September 24, 2025
కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు

కడప కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని MLA మాధవి రెడ్డి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణ తర్వాత మేయర్ పదవి నుంచి ఆయనను తప్పించారు. దీనిపై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లగా మరోసారి ఆయన వాదనలు వినాలని సూచించింది. ఈనెల 17న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి సురేశ్ బాబు తన వాదన వినిపించారు. సంతృప్తి చెందని అధికారి మేయర్‌పై అనర్హత వేటు వేశారు.