News September 24, 2025
సాహసయాత్రకు బయల్దేరిన CRPF మహిళా సిబ్బంది

CRPF ‘యశస్వినీ’ మహిళా బైకర్ల బృందం సాహసోపేతమైన యాత్రకు బయల్దేరింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో సరస్సు వరకూ సాగే బైక్ ర్యాలీ మంగళవారం మొదలైంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, 1,400 కిలోమీటర్ల కఠిన రహదారిపై సాగే ఈ ర్యాలీలో 32 మంది మహిళా బైకర్లు పాల్గొంటున్నారు. దేశభక్తి, జాతి సమైక్యత, మహిళా సాధికారతకు ప్రతీకగా ‘దేశ్ కే హమ్ హై రక్షక్’ నినాదంతో వారు దూసుకెళ్తున్నారు.
Similar News
News September 24, 2025
మెదడు ఆరోగ్యం కోసం పాటించాల్సిన సూత్రాలు

మెదడు ఆరోగ్యం కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
*BP కంట్రోల్‌లో ఉంచుకోండి(<120/80 mmHg). ఇది మెదడులోని రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి పక్షవాతానికి కారణమవుతుంది. *షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోండి(HbA1c <5.7%). *రక్తంలో అధిక కొలెస్ట్రాల్ మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, పనితీరును దెబ్బతీస్తాయి. *మద్యపానం & ధూమపానం మానుకోండి. వ్యాయామం చేయండి. రోజూ 8Hrs నిద్రపోండి.
News September 24, 2025
ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు
News September 24, 2025
పహల్గాం ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!

పహల్గాం ఉగ్రదాడిలో టెర్రరిస్టులకు సాయం చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని J&K పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆపరేషన్ మహదేవ్‌లో ఇటీవల పలువురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఘటనాస్థలిలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను బేస్ చేసుకొని మహ్మద్ కటారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇతడి అరెస్టు కీలకమని పోలీసులు భావిస్తున్నారు.