News September 24, 2025
HYD డెవలప్‌మెంట్‌లో రేవంత్ vs KCR!

బతుకమ్మ కుంట చుట్టూ రాజకీయం మొదలైంది. బే‘కారు’ పాలన..‘ప్రజా’పాలనకు తేడా ఇదే అంటూ కాంగ్రెస్ నేతలు బతుకమ్మ కుంట వీడియోలు SMలో పోస్ట్ చేశారు. అయితే, KCR రంగదాముని చెరువు, మల్కంచెరువు, దుర్గం చెరువులను అభివృద్ధి చేసినా ప్రచారం చేసుకోలేదని BRS నేతల వాదన. 5 ఎకరాల కుంటను అభివృద్ధి చేసిన రేవంత్ గొప్పనా?.. ఎన్నో చెరువులను సుందరీకరించిన KCR గొప్పనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైదరాబాదీ కామెంట్?
Similar News
News September 24, 2025
స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి: DMHO

ఏలూరు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో బుధవారం DMHO అమృతం ఆధ్వర్యంలో పిసి&పియన్డిటిపై డిఏసి సమావేశం జరిగింది. జిల్లాలో స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పూర్తిస్థాయిలో నివేదికలు అందజేయాలని చెప్పారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ లింగనిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News September 24, 2025
అమలాపురం: జిల్లా గణాంక అధికారిగా మురళీకృష్ణ

జిల్లా గణాంక అధికారిగా మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ సంచాలకుడి పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి లభించడంతో ఉప సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, సమర్థవంతంగా, సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని కోరారు.
News September 24, 2025
అక్టోబర్ 15న తూర్పు గోదావరి రెడ్‌క్రాస్ ఎన్నికలు

రాజమండ్రి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు అక్టోబరు 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఈ ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం ఉన్న పేట్రన్, వైస్ పేట్రన్, లైఫ్ మెంబర్స్ ఈ ఎన్నికలకు హాజరు కావాలని సూచించారు.