News September 24, 2025
98 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ 98 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు OCT 10వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Similar News
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News February 10, 2026
మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.
News February 10, 2026
వంట చేస్తూ మాట్లాడుతున్నారా?

వంట చేయడం ధ్యానం వంటిది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఆహారం వండేటప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. టీవీ చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో వంట చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. మౌనంగా చేస్తే వంటకాలు మరింత రుచికరంగా తయారవుతాయని నమ్మకం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రశాంతంగా, ఏకాగ్రతతో వంట చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


