News September 24, 2025
గద్వాలలో రేపు బతుకమ్మ వేడుకలు

గద్వాలలోని తేరు మైదానంలో గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మహిళలు, చిన్నారులు, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. ఆకర్షణీయంగా బతుకమ్మ పేర్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News September 24, 2025
కేసుల పరిశోధనలో పారదర్శకత ఉండాలి: సీపీ అనురాధ

కేసుల పరిశోధన పూర్తి పారదర్శకంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ సూచించారు. కమిషనరేట్ కార్యాలయంలో సిద్దిపేట డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల చేధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News September 24, 2025
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <
News September 24, 2025
ANU PG ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన PG రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.SC ఎన్విరాన్మెంటల్ సైన్స్ 16/16 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 7లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1860లు, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2190లు చెల్లించాలన్నారు.