News September 24, 2025

OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?: వైసీపీ ఎమ్మెల్యే

image

AP: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘OG’పై వైసీపీ ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?’ అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై జనసైనికులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తాము 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించామని, వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా OG అంటే ఓజస్ గంభీర అని మేకర్స్ గతంలో ప్రకటించారు.

Similar News

News September 24, 2025

పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <>నోటిఫికేషన్<<>> జారీ చేసింది. ఇందులో Asst ఇంజినీర్, రవాణా, జైళ్లు, ఫిషరీస్, దివ్యాంగ, మైన్స్, మున్సిపల్, సైనిక్ వెల్ఫేర్ శాఖల్లోని పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించారు. కాగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అసిస్టెంటు డైరెక్టర్, వైద్యశాఖలో లైబ్రేరియన్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వచ్చేనెల 7న ఉంటుందని కమిషన్ పేర్కొంది.

News September 24, 2025

మెదడు ఆరోగ్యం కోసం పాటించాల్సిన సూత్రాలు

image

మెదడు ఆరోగ్యం కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
*BP కంట్రోల్‌లో ఉంచుకోండి(<120/80 mmHg). ఇది మెదడులోని రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి పక్షవాతానికి కారణమవుతుంది. *షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోండి(HbA1c <5.7%). *రక్తంలో అధిక కొలెస్ట్రాల్ మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, పనితీరును దెబ్బతీస్తాయి. *మద్యపానం & ధూమపానం మానుకోండి. వ్యాయామం చేయండి. రోజూ 8Hrs నిద్రపోండి.

News September 24, 2025

ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

image

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు