News September 24, 2025
GROUP-1: సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

TG: గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట దక్కింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 15న చేపడతామని హైకోర్టు తెలిపింది. తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే పేర్కొన్నారు. 6 ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ గ్రూప్-1 GRLను రద్దు చేసిందని, వాటికి ఆధారాల్లేవని అడ్వకేట్ జనరల్ సీజే బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News September 24, 2025
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <
News September 24, 2025
మెదడు ఆరోగ్యం కోసం పాటించాల్సిన సూత్రాలు

మెదడు ఆరోగ్యం కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
*BP కంట్రోల్‌లో ఉంచుకోండి(<120/80 mmHg). ఇది మెదడులోని రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి పక్షవాతానికి కారణమవుతుంది. *షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోండి(HbA1c <5.7%). *రక్తంలో అధిక కొలెస్ట్రాల్ మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, పనితీరును దెబ్బతీస్తాయి. *మద్యపానం & ధూమపానం మానుకోండి. వ్యాయామం చేయండి. రోజూ 8Hrs నిద్రపోండి.
News September 24, 2025
ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు