News September 24, 2025

APPLY NOW.. NLCలో ఉద్యోగాలు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLC) 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్, హెల్త్ అండ్ శానిటేషన్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల ఉద్యోగ అనుభవం గలవారు OCT 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in/

Similar News

News September 24, 2025

మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలు: కిషన్ రెడ్డి

image

TG: మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పడుతున్నాయి. సెల్ ఫోన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు , అగ్రికల్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు వీటికి డిమాండ్ ఉంది. ₹32,000Crతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్‌ను ప్రారంభించాం. స్క్రాప్ నుంచి మినరల్స్‌ను తీసే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

News September 24, 2025

పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <>నోటిఫికేషన్<<>> జారీ చేసింది. ఇందులో Asst ఇంజినీర్, రవాణా, జైళ్లు, ఫిషరీస్, దివ్యాంగ, మైన్స్, మున్సిపల్, సైనిక్ వెల్ఫేర్ శాఖల్లోని పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించారు. కాగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అసిస్టెంటు డైరెక్టర్, వైద్యశాఖలో లైబ్రేరియన్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వచ్చేనెల 7న ఉంటుందని కమిషన్ పేర్కొంది.

News September 24, 2025

మెదడు ఆరోగ్యం కోసం పాటించాల్సిన సూత్రాలు

image

మెదడు ఆరోగ్యం కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
*BP కంట్రోల్‌లో ఉంచుకోండి(<120/80 mmHg). ఇది మెదడులోని రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి పక్షవాతానికి కారణమవుతుంది. *షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోండి(HbA1c <5.7%). *రక్తంలో అధిక కొలెస్ట్రాల్ మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, పనితీరును దెబ్బతీస్తాయి. *మద్యపానం & ధూమపానం మానుకోండి. వ్యాయామం చేయండి. రోజూ 8Hrs నిద్రపోండి.