News September 24, 2025
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ.. ఏ మంత్రం పఠించాలంటే!

శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ ‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్థూతాఖిల లోకపావనకరీ ప్రత్యేక్ష మాహేశ్వరీ| ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి! కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥’ అనే మంత్రాన్ని పఠించాలి. నేడు అమ్మవారిని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
Similar News
News September 24, 2025
రేపు పలు జిల్లాలకు భారీ వర్షసూచన

AP: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. SKL, VZM, మన్యం, అల్లూరి తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 24, 2025
మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలు: కిషన్ రెడ్డి

TG: మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పడుతున్నాయి. సెల్ ఫోన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు , అగ్రికల్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు వీటికి డిమాండ్ ఉంది. ₹32,000Crతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్‌ను ప్రారంభించాం. స్క్రాప్ నుంచి మినరల్స్‌ను తీసే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.
News September 24, 2025
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <