News September 24, 2025
GNT: ప్రైవేట్ ఐటీఐ ఖాళీల భర్తీ ప్రక్రియ

గుంటూరు జిల్లా ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తరువాత సర్టిఫికెట్ల ధృవీకరణ తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐల్లో జరుగుతుందన్నారు. 29న తెనాలి ప్రభుత్వ ఐటీఐలో, 30న ప్రైవేట్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News September 25, 2025
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: MPDO

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో ఈనెల 27న తెనాలిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MPDO అత్తోట దీప్తి బుధవారం తెలిపారు. VSR & NVR కాలేజీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మేళా నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటిఐ, డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు వచ్చే వారు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫొటోతో రావాలని సూచించారు.
News September 24, 2025
ANU PG ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన PG రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.SC ఎన్విరాన్మెంటల్ సైన్స్ 16/16 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 7లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1860లు, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2190లు చెల్లించాలన్నారు.
News September 24, 2025
గుంటూరులో దొంగలు అరెస్ట్

పాతగుంటూరులో చోటుచేసుకున్న దొంగతనం ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు ఇంట్లోని బీరువా పగులగొట్టి రూ.2.40 లక్షలు దొంగలించిన కేసులో CI వెంకట ప్రసాద్, SI అబ్దుల్ రెహమాన్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో వారిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రూ.2.10 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించారు.