News September 24, 2025

కశ్మీర్ లోయలో ఫ్యాషన్ చుక్క ఇక్రా అహ్మద్

image

సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుతున్నారు కశ్మీర్‌కు చెందిన ఇక్రా అహ్మద్. ఆ రాష్ట్రంలో Tul Palav అనే తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను నెలకొల్పి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కుర్తాలు, వెడ్డింగ్ డ్రెస్సులతో ఆకట్టుకుంటున్నారు. లోయలో అస్థిర పరిస్థితులను తట్టుకుని, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News February 1, 2026

అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.

News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.

News February 1, 2026

రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు

image

బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు కేటాయించారు. ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ డబ్లింగ్, ఆధునిక కోచ్‌ల తయారీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రయాణికుల సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడింటికి హైదరాబాద్ (బెంగళూరు, చెన్నై, పుణే రూట్లు) కేంద్రంగా ఉండటం విశేషం.