News September 24, 2025
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరారు. ADE దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. అంబేద్కర్ బినామీ ఇంట్లో గుర్తించిన రూ.2 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 25, 2025
గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

TG: గ్రూప్-1 విషయంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ <<17813238>>స్టే<<>> విధించిన క్రమంలో TGPSC ఫైనల్ రిజల్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్ట్ ఫలితం పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది. అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ <
News September 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 25, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.22 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 25, 2025
బెల్లంపల్లి: 316 మంది కార్మికులు రెగ్యూలరైజ్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన 258 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్ ఏరియాలో 241, మందమర్రి ఏరియాలో 64, బెల్లంపల్లి ఏరియాలో 11 మంది ఉద్యోగులు రెగ్యూలరైజ్ అయ్యారు. భూగర్భ గనుల్లో 190, ఓసీలు, సర్ఫేస్‌లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారు అర్హులు