News September 24, 2025
BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
Similar News
News February 2, 2026
ప్రొ.కోదండరాం అంత నేరం ఏం చేశారు: CM రేవంత్

TG: అధికారంలోకి వచ్చాక కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టారని గత BRS ప్రభుత్వాన్ని ఉద్దేశించి CM రేవంత్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఇలాంటి అవమానం జరగొద్దని ఆలోచించారా అని ప్రశ్నించారు. కోదండరాం శాసనమండలిలో ఉండాలని పంపిస్తే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన ఎన్నికను కొట్టేయించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని ఆరోపించారు. కోదండరాం అంత నేరం ఏం చేశారని ప్రశ్నించారు.
News February 2, 2026
కేసీఆర్ సిట్ విచారణ.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

TG: KCR సిట్ విచారణపై CM రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘KCRకు నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అంటున్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని అడుగుతున్నారు. ఉద్యమకారులు అని వారికి వారే రాసుకుంటున్నారు. శిబుసోరెన్, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, యడియూరప్ప వంటి వారు విచారణను ఎదుర్కోలేదా? జడ్జిల ముందు చేతులు కట్టుకొని సమాధానం ఇవ్వలేదా? మనమేమీ అతీతులం కాదు’ అని అన్నారు.
News February 2, 2026
T20WC వార్మప్ మ్యాచ్.. భారత్ భారీ స్కోర్

ICC మెన్స్ T20WC వార్మప్ మ్యాచ్‌లో భారత్-A జట్టు అదరగొట్టింది. USAపై 238/3 స్కోర్ చేసింది. నారాయణ్ జగదీశన్ సెంచరీ(55 బంతుల్లో 104) చేయగా, ప్రియాంశ్ ఆర్య 28(13 B), తిలక్ వర్మ 38(24 B), బదోనీ 60*(26 B) పరుగులతో విరుచుకుపడ్డారు. భారత ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 23 ఫోర్లు నమోదయ్యాయి. అటు USA టీమ్ 9 మంది బౌలర్లను ప్రయోగించినా ప్రభావం చూపలేకపోయింది.


